ప్రజా పాలన విజయిత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సి ఎం కప్ 2024 ను గ్రామ స్థాయి నుండి రాష్ర్ట స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మాసాయిపేట మండల విద్యాధికారి లీలావతి అన్నారు.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన మండల స్థాయి క్రీడల సన్నాహక సమావేశం లో స్థానిక వ్యాయామ ఉపాద్యాయులు శ్యాం సుందర్ శర్మ ఈ క్రీడల నిర్వహణ కొరకు సూచనలు,నియమాలు తెలిపారు.
గ్రామ స్థాయి లో ఈ నెల 7 నుండి 8 వరకు క్రీడలు నిర్వహించి ఎంపిక చేసిన జట్టు ను ఈ నెల 10 నుండి 12 వరకు నిర్వహించనున్న మండల స్థాయి క్రీడలకు పంపాలని తెలిపారు.
గ్రామ కమిటీ లో పంచాయతీ కార్యదర్శి చైర్మన్ గా,పాఠశాల ప్రధానోపాధ్యాయులు , సీనియర్ క్రీడాకారుడు కమిటీ సభ్యులు గా ఉంటారని తెలిపారు.
ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తప్పని సరిగా www.cmcup2024.telangana.gov.in వెబ్ సైట్ లో వారు పాల్గొనే మండల ,గ్రామ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో స్థానిక స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ధర్మ పురి,సీనియర్ ఉపాద్యాయులు రంగా రెడ్డి
,వివిధ పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.