Friday, November 29, 2024

రేపు జరిగే ప్రభుత్వ పాఠశాలల బంద్ ను విజయవంతం చేయండి *SFI,AISF,PDSU,PDSU,AIPSU:

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

 

A9 న్యూస్ ప్రతినిధి:

 

వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే ప్రభుత్వ పాఠశాల బంద్ ను విజయవంతం చేయాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

 

ఈ సందర్భంగా నాయకులు

బి.రఘురామ్, జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఫుడ్ పాయిజన్ తో 51 మంది విద్యార్థులు చనిపోయారని, ముఖ్యంగా గురుకుల ,కేజీవిపి, ఆశ్రమ పాఠశాలు, ప్రభుత్వ స్కూల్స్ లో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని,

నాణ్యమైన పోషక ఆహారం పెట్టాడటం లేదని ,

సంబంధిత విద్యాశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సరైంది కాదని, పుడ్ పాయిజన్ తో చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే బంద్ కి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు

సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి విఘ్నేష్, PDSU జిల్లా అధ్యక్షులు నరేందర్, AISF నాయకులు కుషాల్, PDSU ఆర్మూర్ డివిజన్ అద్యక్షులు ప్రిన్స్, PDSU జిల్లా నాయకులు మనోజ్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here