భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలో హాస్టల్లలో నెలకొన్న దురదృష్టకరమైన పరిస్థితులపై, ఫుడ్ పాయిజన్ తో ఒక అమ్మాయి మరణించడమే కాకుండా ఎందరో విద్యార్థులు అస్వస్థకు గురి కావడాన్ని బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాదులోని హాస్టల్ల డిప్యూటీ డైరెక్టర్ కార్యలయము ముందు శాంతియుతంగా ధర్నా చేయాలన్న పిలుపుమేరకు ఈరోజు ఆర్మూర్ పోలీసులు ఆర్మూర్ బీజేవైఎం నాయకులైన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందులు బాలును, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ఉపాధ్యక్షులు పెద్దోళ్ల భరత్ ను, బీజేవైఎం ఆర్మూర్ మండల అధ్యక్షులు నరేష్ చారి తదితరులను ఈరోజు ఉదయం 3:30 నిమిషములకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం మైనది.
ఈ విషయం తెలుసుకున్నటువంటి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ పోలీస్ కార్యానికి వెళ్లి అక్రమంగా అరెస్టు చేసినటువంటి బిజెపి నాయకులను వెంటనే విడిచి పెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు హాస్టల్ల పై సీత కన్ను కారణంగా హాస్టల్లో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయని ఎందరో తల్లిదండ్రుల ఆశలను పిల్లల రూపంలో హాస్టల్లకు పంపిస్తే ఆ విద్యార్థులు సరైన భోజనాలు లేక సరైన వసతులు లేక అమ్మాయిలకు సరైనటువంటి సదుపాయాలు లేక చివరికి చలికాలంలో చలిని తట్టుకోలేక అనారోగ్యానికి గురి అవుతున్న పరిస్థితిలో సైతం వారికి దుప్పట్లను సైతం ఇవ్వకపోవడం, నాణ్యమైనటువంటి సరుకులను తీసుకువచ్చి వడ్డించకపోవడం, విశతుల్యమైనటువంటి ఆహారాన్ని వడ్డించడం కారణంగా ఎందరో విద్యార్థులు అనారోగ్యానికి పాలవడం జరుగుతాఉందని దీనికి నిరసనగా శాంతి యుతంగా నిరసన తెలియజేద్దామంటే ఇండ్లల్లో నిద్రపోతున్నటువంటి బీజేవైఎం కార్యకర్తలను అర్ధరాత్రి అక్రమంగా నిర్బంధించడం ప్రజా సామ్యవాదులు ఖండించాలని. రాష్ట్రప్రభుత్వం వెంటనే మేల్కొని హాస్టలను, హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది.