A9 న్యూస్.

ఇందల్ వాయి. బుధవారం మహిళాభివృద్ధి శిశు మరియు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ మరియు బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఇందల్వాయి కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహ ముక్తభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తభారత్ గా నిర్మిద్దామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మా రెడ్డి అన్నారు. బాల్య వివాహాలు చట్ట రిత్యా నేరం చేసిన వాళ్ళు పెళ్లికి హాజరైన వారు కూడా శిక్షర్హులు బాల్య వివాహాలు జరగకుండా ప్రతీ ఒక్కరి బాధ్యత బాల బాలికలకు ఎలాంటి సమస్యలు ఉన్న 1098 నంబర్కు విచితంగా కాల్ చేయవచ్చు ఏదైనా సమస్యలు ఉన్న 112 కు కాల్ చేయవచ్చు అని బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ షేక్ జమ్రుద్ అన్నారు. మహిళలు మరియు బాలికలపై ప్రతి పది నిమిషాలకు ఒకసారి వేధింపులకు గురి కావడం జరుగుతుంది మహిళల పట్ల బాలికల పట్ల హింసలను మనమందరం ముక్తకంఠంతో ఎదుర్కొందామని (ఐ.యస్.ఆర్.డి) ఇన్స్ పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సోలంకి రావలి అన్నారు. టీబి ముక్తభారత్ గా నిర్మిద్దామని పిల్లలలో టీబీ లక్షణాలను త్వరిత గతిన గుర్తించి వైద్య పరీక్షలు చేయించి జిల్లాలో పిల్లల్లో టీబి లేని జిల్లాగా నిర్మిద్దామని టిబి అలర్ట్ ఇండియా డిస్టిక్ కో ఆర్డినేటర్ అమృత రాజేందర్ అన్నారు. బాలికలకు ఎప్పుడు ఆపద వచ్చిన 100 నంబర్ కు కాల్ చేయగలరని సైబర్ మోసాలు సైబర్ నేరాలు జరుగుతాయి అప్రమత్తగా ఉండాలని ఓటీపీలు ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని కానిస్టేబుల్ ఈశ్వర్ తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం బాల్య వివాహ ముక్త భారత్ పై ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ తీయించడం జరిగింది. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సువర్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభ, సునీత అంగన్వాడి కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *