Sunday, November 24, 2024

మనకీ గులామ్ లు వద్దు.. గులాబీ ముద్దు..

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

-బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాతీ గులామ్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డి ఇటలీ గులామ్ అని కిషన్ రెడ్డి అంటుండు. వీరంతా గుజరాత్, ఇటలీ గులామ్ లు.. ఢిల్లీకి సలాం లు. మనకీ గులామ్ లు వద్దు..గులాబీ ముద్దు. తెలంగాణ లో కాంగ్రెస్, బీజేపీ లను రద్దు చేద్దాం” అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ లో జరిగినది అది రైతుల సభ కాదు బూతుల సభ. అది అన్ని వర్గాల ప్రజలను మోసగించిన కాంగ్రెస్ సంపూర్ణ అబద్ధాల సభ. అది వరంగల్ డిక్లరేషన్ కు ఘోరీ కట్టిన ఫ్రేస్టేషన్ సభ. డిక్లరేషన్ లో చెప్పిన మొట్ట మొదటి హామీ 2 లక్షల రుణమాఫీ పేరుతో రైతులకు టోపీ పెట్టినవు అని విమర్శించారు.రేవంత్ రెడ్డి పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు మహావృక్షం. ఆ మహావృక్షం పై రేవంత్ రెడ్డి లాంటి పిట్టలు వచ్చి వాలి పోతుంటాయి. తండ్రీ కొడుకులతో ఊచలు లెక్కిస్తానని అవాకులు చెవాకులు పేలుతున్నావు. కేసీఆర్, కేటీఆర్ లు 1000 కే వీ షబ్-స్టేషన్లు. టచ్ చేస్తే మాడి మసై పోతావు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరపడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రలో కలపడమే అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లు తెలంగాణ కు నాలుగు దిక్కులు. కేసీఆర్ వెలుగునిచ్చే సూర్యుడు. కేసీఆర్ ఫ్యామిలీ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే అవుతుంది. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. కాంగ్రెస్ సర్కారు కు పోలీసుల వత్తాసు పలుకుతున్నారు. లగచర్ల లో గిరిజన మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు. నిజామాబాద్ నగర మేయర్ భర్త పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. అరాచక చర్యలు ఆపకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో తిరగలేడు. కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్న పోలీసుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నాం.వచ్చేది కేసీఆర్ రాజ్యమే. ఒక్కొక్కరి భరతం పడతాం. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా పోరాడాలి అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here