A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు
ఉమ్మడి జిల్లాలో 1080 గ్రామ పంచాయతీలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పాతవి 530 కాగా, 15 కొత్త పంచాయతీలున్నాయి. అలాగే కామారెడ్డి జిల్లాలో 535 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 526 గ్రామపంచాయతీలు పాతవి కాగా, 9 కొత్త గ్రామపంచాయతీలున్నాయి. ఆయా గ్రామ పంచాయతీలకు గతంలో ఉన్న రిజర్వేషన్లలో ఈసారి భారీగా మార్పులు జరుగనున్నాయి. త్వరలో జరిగే ఎలక్షన్లకు పాత రిజర్వేషన్లు వర్తించవని అధికారులు చెపుతున్న మాట. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ గణన తర్వాత రిజర్వేషన్లలో భారీ మార్పులు జరుగనున్నాయి. రిజర్వేషన్లలో బీసీలకు గతం కన్నా మెరుగైన రిజర్వేషన్లు దక్కే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. పురుషుల కన్నా అధిక సంఖ్యలో ఉన్న మహిళలకు ఈసారి అత్యధిక ప్రాధాన్యం దక్కనుంది.