A9 న్యూస్ ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాల లో విద్యార్థిని విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులో న్యాయవాది జిల్లా కన్వీనర్ గటడి ఆనంద్ అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థి దశ నుండి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని చెప్పారు. గ్రామస్థాయి నుండి మొదలుకొని పార్లమెంట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయలలో తమ కావాల్సిన సమాచారం ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు భారతదేశంలో అవినీతి అంతం చేయడంలో ఈ చట్టం ఎంతో దోహద పడుతుందని చెప్పారు అలాగే సెక్షన్ 2 J(1) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గంటసేపు ఉచితంగా రికార్డులు తనిఖీ చేసి అధికారం భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పారు.కోరిన సమాచారం 30 రోజుల్లో ఇవ్వాలని చెప్పారు దరఖాస్తుదారునికి అధికారి సమాచారం తప్పుడు ,అసంపూర్తి సమాచారం ఇచ్చిన అధికారికి రోజుకు 250 నుండి 25 వేల వరకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర కమిషన్ ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, లెక్చరర్లు రాజన్న ,తిరుపతి వేణుగోపాల్ ,
పి ర్ ఓ కత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదములు.