Tuesday, November 26, 2024

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారితో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ:

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు.

 

✅నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారితో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీఅయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు సీఎం గారు దిశానిర్దేశం చేశారు.

 

✅ఎవరి ప్రభావితంతోనో వైఎస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదు. మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగింది. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.

 

✅కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలి.

 

✅యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

 

✅యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలి. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలి. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి.

 

✅మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుంది. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది.

 

✅యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలి.

 

✅సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గారితో పాటు ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు ప్రొ. ఎం. కుమార్ (ఉస్మానియా), ప్రొ. ప్రతాప రెడ్డి (కాకతీయ), ప్రొ. జీఎన్ శ్రీనివాస్ (పాలమూరు), ప్రొ. నిత్యానంద రావు (తెలుగు), ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ (మహాత్మాగాంధీ), ప్రొ. యాదగిరి రావు (తెలంగాణ), ప్రొ. అల్దాస్ జానయ్య (జయశంకర్ వ్యవసాయ), ప్రొ. రాజిరెడ్డి (కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ), ప్రొ. ఉమేష్ కుమార్ (శాతవాహన), ప్రొ. సూర్య ధనుంజయ (మహిళా వర్సిటీ), ప్రొ. గోవర్దన్ (బాసర ఐఐఐటీ) గార్లు ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here