అంధకారం లో ఇందల్వాయి డబుల్ బెడ్ రూమ్ భవనాలు
A9 న్యూస్/ఇందలవాయి
మండలం లోని ఇందలవాయి మండల కేంద్రం లో డబుల్ బెడ్ రూం లో ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు కరెంట్ లేక చీకటి గృహాల్లో నివసిస్తున్నారు. అధికారులకు చెప్పిన,ప్రభుత్వ ఆఫిస్ ల చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదనీ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి 48 మందికి డబుల్ బెడ్ రూం లను మంజూరు చేశారు. మంజూరు చేసిన నాటి నుండి పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.ప్రతి ఇంటికి కరెంట్ మిటర్ ఇవ్వాల్సిన అధికారులు ఇవ్వలేదు.ఒకే మీటర్ పెట్టీ అన్ని గృహాలకు విద్యుత్ సరఫరా చేయడం తో విద్యుత్ బిల్ పెరగడం తో విద్యుత్ అధికారులు కరెంట్ ను కట్ చేశారు. దీంతో కరెంట్ లేక చిన్నపిల్లలు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇచ్చారే తప్ప లబ్దిదారుల సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని అంటున్నారు. డ్రైనేజీ కూడా లేదని గతం లో పలు సార్లు కలెక్టర్, తహసీల్దార్ దృష్టికి పలు సమస్యలను తీసుకుపోయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్ రూం లో నివసిస్తున్న లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా, డ్రైనేజీ సమస్యల్ని తీర్చాలని లబ్దిదారులు వేడుకుంటున్నారుదూస మీణ (లబ్దిదారులు)
కరెంట్ లేదు ఏమి లేదు చిమ్మ చీకట్లో నిద్రిస్తున్న… దోమలు ఎక్కువ ఉండడం తో రోగాల బారిన పడుతున్నాం.చిన్న పిల్లలు బయపడుతున్నారు. అధికారులు స్పందించి మా సమస్యలు తీర్చాలి