ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత కలెక్టరేట్ సెక్షన్ పర్యవేక్షకులతో పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ధరణీ, రాష్ట్ర జిల్లా ప్రజావాణి దరఖాస్తులు, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, భూ సంబంధ కేసులు, భూ సేకరణ, మానవ హక్కుల కమీషన్, ఎస్సీ కమీషన్, ఎస్టీ కమీషన్ కేసులు వివరాలు, ప్రభుత్వ భూముల ప్రొటెక్షన్, ప్రతేక ఓటరు నమోదు కార్యక్రమం, ఎల్.ఆర్.ఎస్., తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణీ కి సంబంధించిన అంశాలపై ప్రతీ రోజు రెండు మండలాలపై సమీక్షా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజావాణి క్రింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన భూ సేకరణ చేపట్టాలని అన్నారు. ఏం.ఎల్.సి. కోసం ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్. సర్వే పనులను సమీక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ లు రంగనాథ్ రావు, ప్రభాకర్ , తదితరులు పాల్గొన్నారు*