A9 న్యూస్ :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ యూనివర్సిటీకి ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు కి సమస్యలు వివరించి, సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది.
*తెలంగాణ యూనివర్సిటీ లో కాలిగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి…
*యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లలో ఉన్న ల్యాబ్లను మెరుగుపరచాలి మరియు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి…
*తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో మహిళలకు 800 మందికి ఒకటే హాస్టల్ ఉంది, ఒక రూమ్ కి 8 నుండి 10 విద్యార్థినిలు ఉంటున్నారు, దీని వల్ల వారికి హాస్టల్ లో రూములు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించాలి.
*తెలంగాణ యూనివర్సిటీలో 2000 మంది సామర్థ్యం కలిగిన ఆడిటోరియం నిర్మించాలి…
*విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు విద్యార్థులకు ప్లేస్మెంట్స్, అలాగే యూనివర్సిటీలో రీసెర్చ్ కోసం అభివృద్ధి చేయాలి…
*విధులు సరిగా నిర్వహించని అధికారులపై మరియు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి…
* హాస్టల్ సమస్యల పరిష్కరించాలి మరియు అలాగే ప్రొఫెషనల్ కుక్స్ నియమించాలి…
* విద్యార్థులకు లైబ్రరీలో మరియు హాస్టల్లో వైఫై సౌకర్యాలు మెరుగుపరచాలి…
*స్పోర్ట్స్ మరియు గ్రాండ్ సమస్యలు పరిష్కరించాలి మరి అలాగే స్పోర్ట్స్ కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి…
*బాలికలకు ఇద్దరినీ, బాలురకు ఇద్దరినీ అదనంగా పిడి లను నియమించాలి…
* తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ భూములను మరియు దాని పరిధిలో ఉన్న భూములను పరిరక్షించి ప్రహరీ గోడ వెంటనే నిర్మించాలి…
*హాస్టల్లో జిమ్ము సౌకర్యం మరియు స్టడీ హాల్స్ , రీడింగ్ రూములను ఏర్పాటు చేయాలి….
* విద్యార్థులకు ప్లేస్మెంట్ సౌకర్యం కల్పించాలి…
* సెక్యూరిటీ సిబ్బందిని పెంచి, యూనివర్సిటీ భద్రతను పెంచాలి….
*హెల్త్ కేర్ ను 24 గంటలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి మరి అలాగే మెడికల్ స్టాఫ్ ను నియమించాలి అలాగే నూతన అంబులెన్స్ అందుబాటులో ఉంచాలి….
*బిఆర్ఎస్ హయాంలో విసీ రవీంద్ర గుప్తా చేసిన అవినీతి
*తెలంగాణ యూనివర్సిటీలో గత విసి రవీంద్ర గుప్తా పరిపాలనలో యూనివర్సిటీలో సుమారు 2 నుండి 3 కోట్ల వరకు అవినీతి జరిగింది, యూనివర్సిటీ లో ఉన్న అధికారులు అవకతవకలు చేసి అవినీతి చేశారు, వాటి పైన గత ప్రభుత్వం ఏసీబీ మరియు విజిలెన్స్ విచారణ చేయించడం జరిగింది. కానీ వాటి వివరాలు ఇంత వరకు వెలువరించలేదు, వెంటనే వాటి గురించి వివరణ ఇవ్వాలి.
*యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 61, 62 ఈసీ మీటింగ్ లాలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేసి, అవినీతి అధికారుల పై చర్యలు తీసుకోవాలి.
*యూనివర్సిటీ లో ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి.
* ఈ కార్యక్రమం లో జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ, యూనివర్శిటీ అధ్యక్షుడు సాయి, కార్యదర్శి అమృత్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ పావని, బాంధవ్య, సంయుక్త కార్యదర్శి సమీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, హరీష్, తరుణ్, రాము, అక్షయ్, లెనిన్, అజయ్, సచిన్, సతీష్ తదితర విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.