A9NEWS:
పిఆర్టియు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ఉపాధ్యాయుడు
జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మాపూర్ నందు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పని చేస్తూ ఇటీవల అకాల మరణం చెందినందుకు పిఆర్టియు తెలంగాణ స్టేట్ నందు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కీర్తిశేషులు శ్రీ మల్లికార్జున్ గారి కుటుంబ సభ్యులకు ఈరోజు ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును వారి సతీమణికి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి మరియు కిషన్ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ కాంప్లెక్స్ హెచ్ఎం సురేందర్ రెడ్డి, లింగన్న మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి గోపి రావీన్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గంట అశోక్ లు అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ టిఆర్టియు టీఎస్ నందు సభ్యత్వం తీసుకోవడమే ఒక వరమని ఈరోజు మల్లికార్జున్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకొనడం వలన తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికి కారణమైందన్నారు సంఘ సభ్యుని కుటుంబానికి సంఘం బాసటగా నిలవడానికి కారణమైందని తెలియజేశారు కనుక ప్రాథమిక సభ్యులకు ఏదైనా అనుకొని సంఘటనలు జరిగినప్పుడు సంఘం వారి ప్రాథమిక సభ్యుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టదని వెన్నంటే ఉండి ఆర్థికంగా ఒక లక్ష రూపాయలు అందజేస్తున్నామని విధిగా ప్రతి ఉపాధ్యాయుడు పీ ఆర్ టి యు టి ఎస్ నందు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జెస్సు వినోద్,గట్ల కిషన్, కాశా గౌడ్, ప్రవీణ్ రెడ్డి , ప్రతాపరెడ్డి, రమణ రెడ్డి, గంగ మోహన్, మండల అసోసియేట్ అధ్యక్షులు నర్సారెడ్డి రవీందర్ గౌడ్, యుపిఎస్ ప్రధానోపాధ్యాయులు గంగయ్య ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.