A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
*రాత్రి జరిగిన ఘర్షణ కు జామైన ట్రాఫిక్ ని పట్టించుకోని ట్రాఫిక్ కానిస్టేబుల్
ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు అయినా పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, రోజురోజుకు ఆర్మూర్ పట్టణంలో వాహనాల రద్దీ పెరుగుతుంది, దానికి తోడు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, చలానాలు వేయడమే వారి బాధ్యత, అధికారులు వారికి టార్గెట్ ఇవ్వడం, ఆ టార్గెట్ ను పూర్తి చేసుకోవడానికి బైక్ పై నుండి వెళ్తున్న వాహనదారుడు నీ వెనుక నుండి ఇద్దరు కానిస్టేబుల్ బైకుపై కూర్చొని ఫోటోలు తీయడమే వారి ధ్యేయం. ఇది ఎంతవరకు సమంజసం పోలీస్ అధికారులకే తెలియాలి. ఎదుటి వ్యక్తి ఏ అవసరం నిమిత్తం వెళ్తున్నారో, తెలిసి తెలియక వెళుతున్న వాహనదారుడు నీ పోలీస్లు వాహనాన్ని ఆపి అడగక బైక్ పై నుంచి వెళ్తున్న వాహనదారుడు నీ వెనుక నుండి ఫోటో కొట్టడం వీరి పని వీరిని మార్చే అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, పట్ల చలానాలకు ఫోన్లకు పరిమితమవుతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇకనైనా మీకు ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పకనే చెప్పవచ్చు, ఆర్మూర్ బస్టాండ్ వద్ద ఎన్నో వాహనాలు నిలిచిపోతాయి కానీ వాటిని మాత్రం పక్కకు తీయమని కూడా అనే నాథుడు లేడు చూసి చూడనట్టుగా వ్యవహరించడం వారి ధ్యేయంగా అక్కడే ఆగి ఉన్న ఆటోలలో కూర్చుంటూ నాకెందుకులే అన్నట్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తిస్తున్న తీరు. ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ కానిస్టేబుళ్లు నియమ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు వ్యవహరించడం చాలా బాగుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తున్న నిర్వాకం చూస్తుంటే ప్రజలు రోడ్డుని ట్రాఫిక్ ని క్లియర్ చేయక ఆటోలో కూర్చుంటే ప్రభుత్వం ఇంతేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.