A9 న్యూస్ వరంగల్:
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
వరంగల్ మండలంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన రావి రాకుల స్వాతి కి అదే గ్రామానికి చెందిన రావిరాకుల నిరంజన్ తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగినది. వీరికి ఇద్దరు పిల్లలు కలరు. ఒక పాప మరియు బాబు. పెళ్లయిన తర్వాత నుంచి మృతురాలి భర్త మరియు అత్త మృతురాలిని కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగిన భర్త నిరంజన్ వినకుండా వేధించడం మానకపోయేసరికి 5వ తేదీ రోజు సాయంత్రం మృతురాలు గడ్డి మందు తాగి ఇట్టి విషయాన్ని వారి అమ్మకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించగా, చికిత్స పొందుతూ స్వాతి మంగళవారం ఉదయం మృతి చెందినది. మృతురాలి తల్లి తలకోట్ల యశోద ఫర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎనుమాముల ఇన్స్పెక్టర్ ఏ.రాఘవేందర్ తెలిపారు.