A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ:
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రతో పాటు మంజీరా నుంచి 3.14 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో మొత్తం 42 గేట్లలో 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విష్ణుపురి బ్యారేజీ గేట్లు ఎత్తడంతో ఇవాళ ఎస్సారెస్పీకి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. కావున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని ప్రమాద హెచ్చరిక చేశారు . శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.