A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:
భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి…
☞ వర్షంలో తడిచిన విద్యుత్ స్తంభాలు, తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు.
☞ విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దు.
☞ చిన్న పిల్లలు కరెంట్ వస్తువులకు దూరంగా ఉంచాలి.
☞ ఇంట్లో ఇనుప తీగలపై దుస్తులు ఆరబెట్టుకోవద్దు.
☞ ఉరుములు, మెరుపుల సమయంలో డిష్ వైర్, టీవీ నుంచి తీసివేయాలి.
☞ రోడ్లపై నీరు నిలిచినప్పుడు మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్లాలి.
☞ వరద భారీగా చేరే ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేయకూడదు.