A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ వివిధ సెక్షన్లను తనిఖీ చేశారు. మున్సిపల్ అధికారులు పర్మిషన్ల కోసం డబ్బులు అడుగుతున్నారని గణపతి విగ్రహాల తయారీదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో గుడిసె కు తైబజార్ రూపాయలు 4000 చెల్లించిన మున్సిపల్ అధికారులు 30,000 రూపాయలు కట్టాలని నోటీసులు ఇచ్చారనిఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక ప్రతిమల తయారీకి ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులపై కమిషనర్ ను రాజును అడిగి తెలుసుకున్నారు.