A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:
మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను సెప్టెంబరు 19 వ తేదీన నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 7 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 17న నిమజ్జనం ఉన్న విషయం చర్చకు వచ్చిన సందర్భంలో మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు సమీక్ష అనంతరం ఈ అంశంపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మిలాద్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 16 న మిలాద్-ఉన్-నబీ వేడుకలు నిర్వహించి, ప్రదర్శనలను మాత్రం వాయిదా వేసుకోవడానికి. ఈ సందర్భంగా మిలాద్ కమిటీ అంగీకరించింది.