A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:
ర్యాగింగ్ చేస్తే జైలుకే..
ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష పడుతుంది. అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు. అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా వేస్తారు. ర్యాగింగ్ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.