A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి పి ఓ డబ్ల్యు రాష్ట్ర7వ మహాసభల సందర్భంగా ఆగస్టు 31న జరిగే ప్రదర్శన, సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి మహిళలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 29 తేదీన పి ఓ డబ్ల్యు ఆర్మూర్ డివిజన్ కమిటీ సమావేశం అధ్యక్షతన ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు ఆఫీసు లో నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలని, ఎన్నికల సందర్భంగా మహిళల కోసం ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పోరాడకుండా మన జీవితాల్లో మార్పు ఉండదని,
పోరాట స్ఫూర్తిని పెంచడానికి, మహిళా హక్కుల సాధనకు భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడానికి జరుగుతున్న మహాసభల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె కోరారు.
బూతు సినిమాలు, అశ్లీల సాహిత్యం, వరకట్న దురాచారాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఫ్రీబస్సు పథకం విజయవంతానికి మరిన్ని బస్సులు పెంచాలని, మహిళకు నెలకు ఇస్తామన్న 4వేల రూపాయల పథకాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆమె కోరారు. 2024 సెప్టెంబర్ 1 మరియు 2వ తేదీల్లో మహాసభలలో ప్రొఫెసర్లు, కార్మిక సంఘాల మహిళ నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని వారి తెలిపారు. ఈ సమావేశంలో పి ఓ డబ్ల్యు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వి.పద్మ, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి దేశెట్టి రాధా, మణెమ్మ, లక్ష్మి, పద్మ ధనలక్ష్మి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.