Monday, November 25, 2024

నేడే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

హైదరాబాద్ A9 న్యూస్ ప్రతినిధి:

*21, 22 తేదీల్లో హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

*బోనాల జాత‌ర‌కు అధికారులు ఆల‌య సిబ్బంది ఏర్పాట్లు పూర్తి

*బోనాల జాత‌ర‌కు వ‌చ్చే వారికి పార్కింగ్ స్థలాల వివరాలు ఇవే!

*నగరంలో మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే ఈ రోడ్లు మూసివేత‌

*నగరంలో ట్రాఫిక్ మ‌ళ్లింపు

*మార్గాల వివరాలు ఇవే!

ఈ నెల 21వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి బోనాల జాత‌ర జ‌ర‌గ‌నుంది. బోనాల జాత‌ర‌కు అధికారులు, ఆల‌య సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు.

21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులుపేర్కొన్నారు ఉజ్జ‌యిని మ‌హంకాళి టెంపుల్‌కు 2 కిలో మీట‌ర్ల ప‌రిధిలో ఈ ఆంక్ష‌లు మ‌ల్లో ఉండ‌నున్నాయి.

క‌ర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, పార‌డైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోట‌రీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌజ్, మినిస్ట‌ర్ రోడ్, ర‌సూల్‌పురా వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌ను కూడా పోలీసులు అల‌ర్ట్ చేశారు. స్టేష‌న్‌లోకి ప్లాట్ ఫాం నంబ‌ర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబ‌ర్ 10 నుంచి లోప‌లికి చేరుకోవాల‌ని ప్ర‌యాణికుల‌కు సూచించారు.

*నగరంలో మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే ఈ రోడ్లు మూసివేత‌

టోబాకో బ‌జార్ నుంచి మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే రోడ్ బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వ‌ర‌కుజ‌న‌ర‌ల్ బ‌జార్ రోడ్ ఆద‌య్య ఎక్స్ రోడ్.

*నగరంలో ట్రాఫిక్ మ‌ళ్లింపు

*మార్గాల వివరాలు ఇవే !

సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బ‌స్సుల‌ను చిల‌క‌ల‌గూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిట‌ల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను బేగంపేట నుంచి క్లాక్ ట‌వ‌ర్,ప్యాట్నీఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డుమీదుగామ‌ళ్లించ‌నున్నారు.

బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వ‌చ్చే వాహ‌నాల‌ను స‌జ్జ‌నాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

ఎస్బీఐ ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను ప్యాట్నీ ఎక్స్ రోడ్, ప్యార‌డైస్, మినిస్ట‌ర్ రోడ్ లేదా క్లాక్ ట‌వ‌ర్, సంగీత్ ఎక్స్ రోడ్, సికింద్రాబాద్ స్టేష‌న్, చిల‌క‌ల‌గూడ‌, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

ప్యార‌డైస్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను ఆర్పీ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు లేదా పార‌డైస్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

హ‌కీంపేట్, బోయిన్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను క్లాక్ ట‌వ‌ర్ వర‌కే అనుమ‌తించ‌నున్నారు. మ‌ళ్లీ ప్యాట్నీ, ఎస్బీఐ ఎక్స్ రోడ్ మీదుగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లాల్సి ఉంటుంది.

*బోనాల జాత‌ర‌కు వ‌చ్చే వారికి పార్కింగ్ స్థలాల వివరాలు ఇవే !

హ‌రిహ‌ర క‌ళా భ‌వ‌న్, మ‌హ‌బూబ్ కాలేజీ, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియాహై స్కూల్, గ‌వ‌ర్న‌మెంట్ అద‌య్య మెమోరియ‌ల్ హై స్కూల్, ఆద‌య్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోట‌ల్, అంజ‌లి థియేట‌ర్, ప‌రేడ్ గ్రౌండ్.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here