A9 న్యూస్ ప్రతినిధి:
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ ఆధ్యక్షులు ప్రిన్స్ డిమాండ్ చేశారు.
ధర్పల్లి కేంద్రంలో పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులతో కలిసి ఎం ఈ ఓ స్వామి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని కెసిఆర్ ప్రభుత్వం బ్రష్టు పట్టించాడని, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ 8 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని, విద్యాశాఖ మంత్రి నియమించాలని, అసెంబ్లీ సమావేశలలో శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరియు అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు కూడా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వంశీ, షాభాజ్, నాయక్, తదితరులు పాల్గొన్నారు.