A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 42 వ వారం ఉత్సాహంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ ఆదివారం కాలనీలోని భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణ పరిసరాల్లో శ్రమదానం చేశారు. ఆలయానికి నలువైపుల, సామాజిక భవనం ముందర, పక్కన రోడ్లను, పరిసరాలను శుభ్రం చేశారు. చీపుర్లతో చెత్తను ఊడ్చారు. పారలతో చెత్తను గమేలాలలో ఎత్తి దూరంగా వేశారు. వ్యర్థాలను ఒకచోట కుప్పగా పోసి నిప్పంటించారు. కట్టర్ తో చెట్ల కొమ్మలను కత్తిరించారు. ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ మంగళవారం హనుమాన్ జయంతి ఉన్నందున ఆలయ పరిసరాలను శుభ్రం చేశామని తెలిపారు. 42 వారాలుగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ఇతర కాలనీలకు స్పూర్తిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి నిధుల మంజూరికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాలనీ వాసులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జయంతి ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటికీ సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. ఆలయ కమిటి అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయలని కోరారు. కాలనీ అద్యక్షుడు గోసికొండ అశోక్, ఆలయ కమిటి అద్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్, కాలనీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు సుంకే శ్రీనివాస్, కొక్కెర భూమన్న, కార్యదర్శులు కొంతం రాజు, సాయన్న, ఎర్ర భూమయ్య, ఎస్సారెస్పీ డి ఇ గణేశ్, ఎల్టీ కుమార్, బొల్లు జీవన్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఘనపురం సంతోష్, కానిస్టేబుల్ ప్రసాద్, రవి,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *