A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
పీసీసీ పీఠం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే ఒకే.. అయితే రెడ్లలో ఎవరికైనా ఆ అవకాశం ఇస్తే మాత్రం.. ఆ పోటో పడే వారి జాబితాలో తాను సైతం ఉంటానని ఈ సందర్భంగా ఆయన కుండ బద్దలు కొట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.
అయితే ఆ కుటుంబం అధికారం కోసం అడ్డదార్లు అయితే తొక్కలేదని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని అభివర్ణించారు. ఇక బీజేపీపై ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ అని చెప్పారు.
రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. అయితే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ఆ విషయంపై అవగాహన లేదని ఈ సందర్భంగా జగ్గారెడ్డి వ్యంగ్యంగా అన్నారు. అలాగే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌పై జగ్గారెడ్డి ఈ సందర్భంగా పంచ్‌లు విసిరారు. ఆర్థిక వనరులు, బతుకు తెరువు కోసమే ప్రశాంత్ కిషోర్ సర్వే సంస్థను ఏర్పాటు చేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు, మాలల పార్టీ అని.. మాదిగలు, మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా అభివర్ణించారు. మీరా కుమార్, దామోదర రాజనర్సింహకు కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ లాభం చేకూరేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారన్నారు.
తాను ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చెబుతున్నా.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆ పార్టీకి రాహుల్ గాంధీనే రాజు అని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా, గెలిచానా, రాహుల్ గాందీ మాత్రం రాజేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేపీ
H.No:1-86/15/1
Annapurna Colony , Kota Armoor , ARMOOR.
District: Nizamabad, Telangana India.
+91 94406 21911