A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:

తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఎన్నికలు హైదరాబాద్ లో గల నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్మూర్ పట్టణానికి చెందిన సాంబడి ప్రవీణ్ నియమితులయ్యారు .ట్రెజరర్ గా బానోత్ వినోద్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తరబడి అనేకమంది యువతి, యువకులకు తైక్వాండో లో శిక్షణను ఇచ్చి నిష్టాతులను తయారు చేసి టైక్వాండో మాస్టార్లుగా తీర్చిదిద్దామన్నారు. ఎంతోమంది పేద పిల్లలకు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ మరియు ఆరోగ్య సూత్రాలను అందిస్తూ ఆరోగ్యభారత నిర్మాణంలో అభిరామంగా సేవలందించామని మా సేవలను గుర్తించి మాకు ఈ బాధ్యతలను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో టైక్వాండో రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వహీద్ ఆలీ, రాష్ట్ర ట్రెజరర్ మారుతి మరియు రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ వారు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *