A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ మంచిర్యాల- హైదరాబాద్ మధ్య నడిచే టీఎస్ ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్ పై 10 శాతం రాయితీ కల్పించినట్లు మంచిర్యాల డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్ లపై 10 శాతం డిస్కౌంట్ కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.