A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28:
తెలంగాణలో టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్‌కు నోటిఫికేషన్, టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది.
ఓపెన్ స్కూల్ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియా మక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. వీళ్లు గతంలో నిర్వహించిన టెట్ పరీక్షలో అర్హత సాధించిన ప్పటికీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి నిరాకరించాలని నిర్ణయించి నట్లు సమాచారం.
తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
విద్యాశాఖ తాజా నిర్ణయంతో దాదాపు 25 వేల మంది అభ్యర్ధులు డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.