A9 న్యూస్ రంగారెడ్డి జిల్లా మార్చి 28:
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
కాటేదాన్‌లో రవి ఫుడ్స్‌కి చెందిన బిస్కెట్ ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు అలుముకో వడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.
ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహు టిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
5 ఫైర్ ఇంజిన్ల తో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సిఉంది.