Monday, November 25, 2024

అల్లకొండ ఖిల్లా ను కాపాడు తాం – ముత్యాల

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

బాల్కొండ ప్రతినిది మార్చ్ 25:

నిజామాబాద్ జిల్లా లోని అల్లకొండ (బాల్కొండ) పురాతన మైన ఖిల్లా పునారుద్దన తో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ద డానికి ప్రభుత్వాన్ని అభ్యర్తిస్తనని రాష్ట్ర నేషనల్ యూత్ ప్రాజెక్ట్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్,మరియు దక్షిణ ఆసియా మైత్రి సదస్సు రాష్ట్ర కోశాధికారి మరియు బాల్కొండ నియోజక వర్గం కాంగ్రెస్ ఇంఛార్జి ముత్యాల సునిల్ కుమార్ అన్నారు.సోమవారం రోజు మోర్తాడ్ లో ఆయన క్యాంపు కార్యాలయంలో బాల్కొండ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ చరిత్ర కారు లైన బ్రహ్మా రౌతు నర్సింగ్ రావు రచించిన “అల్ల కొండ ఊరు ఉద్భవం – 

ఐదు ఆలయాలకు ప్రసిద్ది” పుస్తక ఆవిష్కరణ చేస్తూ ప్రసంగించారు. ఈ సందర్బంగా సునిల్ మాట్లాడుతూ మానవ జీవన విజ్ఞానిక చరిత్ర అవసమని నిజామాబాద్ అల్లకొండ ఖిల్లా చరిత్ర మానవ విజ్ఞానానికి దోహద పడే దేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అల్లకొండ ఖిల్లా అభివృద్ధికి ఏ మాత్రం శ్రద్ద తీసుకోలేదని, ఎంతో చరిత్ర గల ఖిల్లా పూర్వ చరిత్రను కాపాడు లేక పోవడం విచారకరమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. మానవ జీవన వికాసానికి పుస్తకాలే నిదర్శనమని బాల్కొండ లో పుట్టి పెరిగి ఉన్నత ఉద్యోగం చేసిన బి.అర్.నర్సింగ్ రావు లాంటి రిటైర్డ్ ఉద్యోగి తాను పుట్టిన “ఊరికి ఉపకారం” కోసం ఒక నాటి అల్లకొండ నేటి బాల్కొండ పై పుస్తకాన్ని బావి తరాలకు గుర్తుండి పోయే విధంగా రచించి నందుకు నర్సింగ్ రావును అభినందించారు. పుస్తక రచయిత బి.అర్.నర్సింగ్ రావు ఖిల్లా గురించి వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ వారి ఇచ్చిన లేఖ ప్రకారం ఖిల్లా అంతర్గత భూములు 39 ఏకరాల 17 గుంటలు ఉండాలి, ప్రస్తుతం ఖిల్లా భూముల తో పాటు పూర్వం ఖిల్లా చుట్టూ ఉండే కందకం(నాల) కందకాలు మొత్తం మట్టితో పూడ్చి వేసి భవంతులు నిర్మించారు ఇది గత 9 సంత్సరకాలంగా జరుగుతూనే ఉంది ఖిల్లా భూములు కందకాలు 75% కబ్జాలకు గురైంది.మిగిలిన 25% కందకం ఖిల్లా ఉత్తర భాగంలో శైదా “నాభిఘోరీ” ముందర ఉంది. ఖిల్లా కు సంబంధించిన భవoతులు ఖిల్లా ముఖ ద్వారాలు ఆరు ఉండేది వాటిలో నాల్గింటిని భూకబ్జా దారులు కూల్చివేశారనీ ఇప్పుడు మిగిలింది (02)రెండు ముఖ ద్వారాలు మాత్రమే మిగిలాయి ఇవి కూడా కూల్చే అవకాశం ఎక్కువగా ఉందనీ ఈ విషయంలో మార్చ్ 5వ 2024 రోజున ముఖ్య మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో వివరించానని. ఈ విషయంలో ముత్యాల సునిల్ కుమార్ జోక్యేం చేసుకొని ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి సంప్రదించి ఖిల్లలో మిగిలిన భవoతులను మరమ్మతులు చేసి అల్లకొండ ఖిల్ల నీ పర్యాటక కేంద్రంగా గుర్తించాలని “అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బి.ఆర్ నర్సింగ్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పుస్తక వితరణలో బాల్కొండ నియోజక వర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు సయ్యద్ రీయాజొద్దిన్, సహాయ కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్ల బి.సి సంగం అధ్యక్షులు వేణు గోపాల్ యాదవ్ తో పాటు తది తరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here