నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 1:

ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు.

గత తొమ్మిది సంవత్సరాలు ప్రవేశపెట్టిన పద్ధతుల్లోనే ఈ బడ్జెట్ లో కూడా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడుదారులకు ఉపయోగపడే పద్ధతుల్లో ఉందని ఆయన అన్నారు ఎన్నికల ముందైనా పేదలకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ధరలు తగ్గిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసినప్పటికీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కానీ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కొరకు కానీ నిధులను కేటాయించలేదని నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఏర్పాటు చేయటానికి నిధులను కేటాయించకపోవడంతో పాటు మూసివేసిన చక్ర పరిశ్రమలను ప్రారంభించటానికి నిధులు కేటాయించలేదని పసుపు కు కనీస మద్దతు ధరకు కావలసిన బోనస్ను నిర్ణయించలేదని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *