నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

బాల్కొండ మండల కేంద్రలోని శ్రీ మణికంఠ సన్నిధానంలో అయ్యప్ప మెట్లపూజను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ ప్రధాన వీధుల గుండా అయ్యప్ప ఆభరణాలను ఊరేగించి, మధ్యాహ్నం మెట్ల పూజ నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రికి ఆలయ ప్రధాన పూజారి గణేష్ జోషి ఆధ్వర్యంలో గణపతి,సుబ్రహ్మణ్య స్వామి,అయ్యప్ప స్వామి విగ్రహాలకు పలు రకాల అభిషేకాలు నిర్వహించి, పదునెట్టంబడి (మెట్లపూజ) ను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రవర్మ గురుస్వామి బృందం పాడిన భజన కీర్తనలు పలువురు భక్తులను ఎందరినో ఆకట్టుకున్నాయి. అయ్యప్ప నామస్మరణ, శరణుఘోషతో ఆలయ ప్రాంగణంమార్మోగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. రాత్రికి హాజరైన అయ్యప్ప స్వామి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు చిన్న గణేష్,ధర్మపురి కాంపౌండర్,ఠాకూర్ బలరాం సింగ్,మెడికల్ నరేందర్,జాపు సాయినాథ్,కోటగిరి రమేష్,అంబటి నవీన్,గాండ్ల రాజేష్,బట్టు నవీన్,యమగంటి లింగాగౌడ్,బోట్ల రవీన్ ప్రసాద్,పిల్లేండ్ల సంతోష్,పోశెట్టి,సురేష్ ఆలయ కమిటీ చైర్మన్ సిహెచ్ కిషన్,మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్,రంగంపేట యాదగిరి, పలువురు అయ్యప్ప గురుస్వామిలు మొదలుకొని కన్నెస్వామి లకు వరకు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *