ఇందల్వాయి A9 న్యూస్ ప్రతినిధి:
ఇందల్వాయి గ్రామ పెద్ద చెరువు సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మిగతావారు స్వల్పంగా గాయపడినట్లు పోలీసు వారు తెలియజేశారు .బాధితులు గండి తండాకు చెందిన వారు మరియు ఇందల్వాయి గ్రామానికి చెందిన వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెళుతూ ఎదురెదురుగా గుద్దుకోవడం వలన ఇందల్వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రాజం లక్ష్మీబాయి కుమారుడు రాజేష్ 16 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది . స్వల్ప గాయాలైన వారిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేపించడం జరుగుతుందని ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతిదయాన్ని పోస్టుమార్టం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలియజేశారు .ఈ సందర్భంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ మైనర్ బాలురకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే తల్లిదండ్రుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.