నిజామాబాద్ A9 న్యూస్:
కిల్ల డిచ్పల్లి గ్రామంలో దేవాలయ కమిటీ శ్రీ సీతారాముల వారి దేవస్థానానికి కమిటీ చైర్మన్ గా జంగం శాంతయ్య ను నియమించారు, అది ఏకగ్రీవంగా గ్రామ ప్రజల తరఫున, పాలకవర్గ సభ్యుల తరఫున, అన్ని వర్గాల కార్యకర్తలు తరఫున నియమించడం జరిగినది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు చైర్మన్ అయినటువంటి జంగం శాంతయ్యకు స్వీట్ అందించడం పత్రికను అందించడం జరిగింది. ఇది గ్రామ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి వీ.డి.సి, యువజన సంఘాలు అందరూ అన్ని రకాల పార్టీ కార్యకర్తలు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు, పాలకవర్గ సభ్యులు, వీ.డి.సి మరియు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.