తెలంగాణ A9 న్యూస్:
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఖరారు, డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హస్తవాసిని మార్చి, అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. రెండు రోజుల పాటు చర్చించిన అధిష్ఠానం అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకొంది. ‘రేవంత్ రెడ్డి అనే నేను..’ అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.