నిజామాబాద్ A9 న్యూస్:   

– తొలిసారి అసెంబ్లి లో అడుగు పెట్టనున్న పైడి

 

– తొలిసారి ఆర్మూరు గడ్డపై వికసించిన పుష్పం

ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నడు కనివిని ఎరుగని రీతిలో తొలిసారిగా ఆర్మూర్ గడ్డపై కాషాయజంట ఎగిరింది. కొత్త ముఖాన్ని ఆదరిస్తారా అన్న అనుమానాన్ని పక్కనపెట్టి, ప్రజలు బిజెపి కి మద్దతుగా నిలిచి రాకేష్ రెడ్డిని విజయకేతనం ఎగురవేసేలా చేశారు. మొత్తం 16 రౌండ్లు ముగిసేసరికి బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించారు.

బిజెపి అభ్యర్థి రాకేష్ రెడ్డికి 71,651 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డికి 42,349 ఓట్లు వచ్చి రెండు స్థానంలో నిలిచారు, కాగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కి 39,051 ఓటు వచ్చే మూడో స్థానంలో నిలిచారు.

బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి 29,302 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ ప్రకటించి, పైడి రాకేష్ రెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో తొలిసారిగా కాషాయ జెండా ఎగరడం వలన ప్రజలు కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *