నిజామాబాద్ A9 న్యూస్: 

ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు .

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని లో గల ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇబ్రహీం అనే ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుని కి దేహ శుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జరిగిన సంఘటన పైన ఎం ఈ ఓ రాజా గంగారాం కు ఫిర్యాదు చేయగా బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.

ఇలాంటి సంఘటనలు తరచూ జరగడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఎంఈఓ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్మూర్ పట్టణంలో తరచుగా ఏదో ఒక సంఘటనలు జరుగుతున్న ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్వం మైనర్ బాలిక పైన ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా చట్టపరమైన శిక్షను ఉపాధ్యాయునికి వేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని విద్యార్థిని తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *