నిజామాబాద్ A9 న్యూస్:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల సుద్ధపల్లి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల సుద్ధపల్లి నందు బుధవారం పిడిఎస్ యు నాయకులు అయినటువంటి రాజేశ్వర్, శివ, సాయి, రవీందర్, అక్షయ్ ,ఆకాష్ లు పాఠశాలకి మధ్యాహ్నం సమయంలో వచ్చి ప్రధాన చార్యులను కలవడానికి అనుమతి కోరినారు. కానీ వారు ఆ సమయంలో ఆర్. సి .ఓ తో జూమ్ సమావేశంలో ఉండటంవల్ల వారి అనుమతిని నిరాకరించడం జరిగింది.
వారిని మరలా రెండు రోజుల తర్వాత రమ్మని వైస్ ప్రిన్సిపాల్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయినా వారు వినకుండా కళాశాల కాపలాదారు అయిన ఈశ్వరి తో గొడవపడి లోపలికి అనుమతి లేకుండా చొరబడి మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడంలేదని, కుళ్ళిన కూరగాయలు వండుతున్నా పట్టించుకోని ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని అసత్య ఆరోపణలు చేస్తూ ఈనాడు దినపత్రికలో శీర్షిక ప్రచురించడం వలన తమ పాఠశాల యొక్క వ్యవస్థ పై బురద చల్లే ప్రయత్నం జరిగినందున వారు ఈనాడు సంపాదకులకు లేఖ రాయడం జరిగింది.
ఈ శీర్షికల లో ఊహ జనితమైన, నిరాధార ఆరోపణలను వార్తలుగా ప్రచురించకూడదని కోరి తదుపరి సంచికలో వాస్తవాలను రాయాలని తెలియజేశారు. అంతేకాకుండా విద్యార్థినుల రక్షణ నిమిత్తం అనుమతి లేకుండా ఎవరు కూడా రాకుండా తగు జాగ్రత్తలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరడమైనది. అంతేకాకుండా పి.డి.ఎస్. యు మరియు ఇతర విద్యార్థి సంఘ నాయకులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని నిరాధార ఆరోపణలు చేయకూడదని విజ్ఞప్తి చేయడం జరిగింది.
గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు ఎల్లవేళలా విద్యార్థుల అభ్యున్నతికై పాటుపడుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలను అన్ని రంగాలలో అందిస్తున్నాయి ఇలాంటి అసత్య ఆరోపణల వలన గురుకుల విద్యాసంస్థలపై ప్రభావం పడకుండా చూడాలని వారు కోరడం జరిగింది.