నిజామాబాద్ A9 న్యూస్:

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక కు ఆత్మకు శాంతి కలగాలని మరియు న్యాయం జరగాలని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా నాయకులు వినయ్ రెడ్డి మాట్లాడుతు ప్రవళికది ఆత్మహత్య కాదు అది కెసిఆర్ ప్రభుత్వo చేసిన హత్య అని అన్నారు.

 

ఉద్యోగాల కోసం రాత్రి పగలు అనక కష్టపడి చదువుతున్న యువత, కెసిఆర్ ప్రభుత్వ విధానల వల్ల టీఎస్పీఎస్సీ తప్పిదల వల్ల వారి కష్టం వృధా అవ్వటంతొ ఆత్మహత్యలకు పాలపడుతున్నాడు అని, మేం యువతకు చెప్తున్నo మీరు మనోధైర్యం కోల్పోకూడదు అని 50 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని, రెండు లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తాం అని, టిఎస్పిఎస్సి ని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పటిష్టమైన వ్యవస్థ ప్రవేశ పెడుతాం అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ నాయకులు మీర్ మాజీద్, అజ్జు, జిమ్మి రవి, అబ్దుల్ ఫయిమ్, అజ్జు, బారి పురుషోత్తం, బాలకిషన్, లక్ష్మి నారాయణ, పింజ అభినవ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *