నిజామాబాద్ A9 న్యూస్:
ఆలూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, అయినా వెంట ఆర్మూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఆలూరు మండల అధ్యక్షులు విజయ్, వినయ్ రెడ్డి ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతూ ఆర్మూర్ నియోజక వర్గం నుండి ఈసారి ఎన్నికలలో 40వేల నుండి 50వేల మెజారిటీ తో విజయం సాధిస్తాం అని అన్నారు. ఆలూరు మండలం లో బిఆర్ఎస్ పార్టీ ఎంచేసింది. గెలిచిన ఎమ్మెల్యే అబద్ధాలు చెబుతూ హైద్రాబాద్ లో మకాం వేశారు. కానీ నియోజక వర్గంలో ఎక్కడా కానబడుత లేడు అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈసారి 6 పతాకలతో మి ముందుకు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చినా వెంటనే ఒక్క నెల రోజుల లోనే పక్కగా పథకాలను అందిస్తము.ఈసారి ఆర్మూర్ గడ్డ మీద జీవన్ రెడ్డిని బొందపెట్టుడు కాయం అన్నారు. ఈసారి ఆర్మూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. పార్టీకి నాయకులు ముఖ్యం, అలాగే పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మి గ్రామంలోకి వస్తె ఇచ్చిన అమిలు మీరు నెరవేర్చారా, లేకపోతే ఈసారి ఓట్లు అడగకండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గ్యారంటీ హామిలను ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి వివరించాలన్నారు. అంతే కాకుండా ప్రతిఒక్కరూ పార్టీ కోసం అయార్నిషలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలియజేశారు.