నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె గత తొమ్మిది రోజులుగా చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు చీమకుట్టినటుగా లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మినీ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డున పడి నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం సరైనది కాదని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుకై చట్టం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహిళల పట్ల చిన్న చుపువుందని అయన అన్నారు. ఒకవైపు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని ప్రకటిస్తూనే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తి పోరాడుతుంటే వారిని చర్చలకు పిలిచి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే బదులు మరింత జటిలం చేయటం సరైనది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచకుండా అంత్యక్రియల ఖర్చులను ప్రకటించటం

 

బాధ్యతారహితమని వెంటనే అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అధికారుల వేధింపులను, బెదిరింపులను మానుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం మరింత తాత్సారం చేస్తే అంగన్వాడీ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం అవుతుందని, అందుకు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. స్వర్ణ ప్రాజెక్టు నాయకులు సరిత, జరీనా సునీత, లలిత, అంజలి విజయ, శివరాజమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు ముందుగా నిన్న అనారోగ్యంతో మరణించిన మోసరా సెక్టార్ కు చెందిన మంగ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *