Tuesday, November 26, 2024

తెలంగాణలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img
ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా 10 వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
ఈరోజు సీఎం కేసీఆర్ చేతులమీదుగా 9 మెడికల్ కాలేజీలు ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నేటి నుండి నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, వీరితో పాటు ఎంపీలు శ్రీ దామెదర్ రావు, శ్రీ రాములు, శ్రీమతి కవిత, శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ మధునూధనాచారి, శ్రీ శేరి సుభాష్ రెడ్డి, శ్రీ ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు శ్రీ విప్ రేగా కాంతారావు, శ్రీ బాల్క సుమన్, శ్రీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
CM Sri KCR inaugurates 9 new medical colleges in Telangana
In a historic move, Telangana Chief Minister Sri KCR virtually inaugurated 9 new government medical colleges in 9 districts from Pragathi Bhavan today.
The districts include Kamareddy, Karimnagar, Khammam, Nirmal, Jayashankar Bhupalpally, Komarambheem Asifabad, Rajanna Siricilla, Vikarabad and Jangaon.
This is a major step towards achieving the Telangana government’s goals of establishing one medical college in each district, providing quality medical education and strengthening healthcare in the State.
Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here