Wednesday, November 27, 2024

తెలంగాణ ప్రజలపై కేసిఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

*తెలంగాణ ప్రజలపై కేసిఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదు.

*తెలంగాణ ప్రజల సమస్యలపై, వారి బాగోగులపై కేసిఆర్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ ఉండదు.

*ఎద్దు..ఎవుసం మీద అవగాహన లేనోడు కూడా కేసిఆర్ ను విమర్శిస్తున్నాడు.

*10 ఏళ్ల కింద కాంగ్రెస్ పెట్టిన గోసలు మర్చిపోవద్దు…9 ఏళ్లుగా కేసిఆర్ చేస్తున్న మంచిని మర్చిపోవద్దు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో ఆదివారం పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాన కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం 20 లక్షల వ్యయంతో శంకుస్థాపన, 6లక్షల వ్యయంతో గోసంగి సంఘం నూతన సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

అనంతరం..ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో 1.70 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం,నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 పై 14 లక్షల వ్యయంతో మరమ్మతుల పనుల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు…

*కేసిఆర్ వల్లే తెలంగాణ సుభిక్షం..కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష

తెలంగాణ ప్రజలపై సీఎం కేసిఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని,తెలంగాణ ప్రజల సమస్యలపై,వారి బాగోగులపై కేసిఆర్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ ఉండదని మంత్రి వేముల స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని,ప్రజలకు ఏమీ కావాలో కనీస అవగాహన కూడా లేదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో చందమామ కథలు చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ గెలిస్తే 4వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మొన్ననే కర్ణాటక లో గెలిచింది కదా అక్కడ ఎందుకు 4వేల పెన్షన్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 200 ఉన్న పెన్షన్ 2వేలు చేసింది కేసిఆర్ అని, కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మొద్దని అన్నారు.

కేసిఆర్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీనే ఉండే కదా ఎప్పుడు ఎందుకు ఇప్పుడున్న అభివృద్ది జరగలేదని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు భీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, సకాలంలో ఎరువులు, కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు, కుల వృత్తులకు ప్రోత్సాహం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలకు, రైతులకు కేసిఆర్ భరోసా కల్పించారన్నారు. ఎద్దు..ఎవుసం మీద అవగాహన లేని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ ను విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు అని రైతును మళ్ళీ గోస పెట్టే మాటలు చెప్తున్న రేవంత్ ఎక్కడ..? రైతులకు కరెంట్ బాదే ఉండొద్దని వ్యవసాయానికి పుష్కలంగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న కేసిఆర్ ఎక్కడా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పెట్టిన గోసలు మర్చిపోవద్దు, 9 ఏళ్లుగా కేసిఆర్ చేస్తున్న మంచిని మర్చిపోవద్దని మంత్రి వేముల కోరారు. ఎంపి అరవింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసి గెలిచి ఆయన ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని నిలదీశారు.

మాటలు చెప్పడం కాదు..అభివృద్ది చేసి చూపాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఒక యజ్ఞంలా అభివృద్ది జరుగుతుందని, కేవలం కేసిఆర్ వల్లే తెలంగాణ సుభిక్షం అయ్యిందన్నారు. ఎప్పటికైనా కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ప్రజలంతా మంచి చేసిన కేసిఆర్ కు మద్దతుగా నిలవాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here