నిజామాబాద్ A9 న్యూస్:
బోధన్ పట్టణంలోని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని, తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శశిధర్, మధు, లోకేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.