Tuesday, November 26, 2024

క్షత్రియ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

క్షత్రియ పాఠశాల చేపూర్ మరియు ఆర్మూర్ నందు నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి మరియు కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్ మరియు కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో శ్రీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ధర్మం కోసం శ్రీ కృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్దం లో పాండవుల పక్షాన నిలబడి ధర్మ సంస్థాపన కొరకై కృషి చేసినారు. గీత సారాంశం తో ప్రపంచానికి అంతులేని విజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ప్రపంచానికి అందించినాడని అన్నారు. అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ భగవానుడు చేరసాలలో జన్మించి, గోకులంలో పెరిగి పెద్దవాడై ద్వారకలో రాజనీతిని ప్రదర్శించినాడని అన్నారు.

 ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహ స్వామి, అనిల్ కుమార్ లు మాట్లాడుతూ శ్రీ కృష్ణుడు ఏప్పుడు ధర్మం వైపే ఉన్నాడని సృష్టిలో ఏ కార్యం ఎలా జరగాలో అలాగే జరిపించినాడని,యుద్ధం చేయను అని అన్న అర్జునుడికి గీతోపదేశం చేసి ధర్మాన్ని గెలిపించినాడని తెలిపారు.

ఈ సందర్భంగా బాల బాలికల శ్రీ కృష్ణుని, గోపికల వేశాధారణ మరియు చిన్నపిల్లలు ఉట్టి కొట్టె కార్యక్రమం చూపురలను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అల్జాపూర్ జయంత్, అక్షయ్, పరీక్షిత్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here