నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పొట్టేత్తడంతో. 16 గేట్ల ద్వారా నీటిని వదలగా, రాత్రి 10.30 గంటలకు మరో 5 గేట్లు ఎత్తి 74,976 క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరి లోకి వదులుతున్నారు. కాగా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 64 వేల క్యూసెక్కుల నీరు ఎగువ నుండి కోటేస్తుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను పూర్తి స్థాయిలో నీరు నిల్వఉంది.