నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు, ఇట్టి ర్యాలీని క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 100 మీటర్ల పొడువు గల త్రివర్ణ పతకాన్ని మోస్తూ దాదాపు 800 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్న విజయోత్సవ భారీ ర్యాలీ నీ మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది.
ఈ ర్యాలీ లో ఇస్రో శాస్త్ర వేత్తల ఘనకీర్తిని పొగుడుతూ విద్యార్థులు నినాదాలతో కొనసాగించారు. అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన చంద్రయాన్ 3 విజయంపట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, క్షత్రియ స్కూల్ మరియు క్షత్రియ కళాశాల విద్యార్థులతో చంద్రయాన్-3 విజయం ఇస్రో శాస్త్రవేత్తల కృషి, పట్టుదల మరియు అకుంఠిత దీక్షతో నెరవేరిందని, చంద్రుని దక్షిణ ధ్రువం పై దిగిన మొదటి దేశంగా భారత్ అవతరించిందని, చంద్రయాన్-3 విజయం కోసం ఇస్రో బృందం ఎంతో శ్రమించి విజయాన్ని అందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, స్కూల్ ప్రిన్స్ పాల్ లక్ష్మీనరసింహ స్వామి, కళాశాల అధ్యాపకులు, స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులుతో పాల్గొన్నారు.