నిజామాబాద్ A9 news
మున్సిపల్ కార్మికులకు మద్దత్తు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తరపున తమ న్యాయబద్దమైన సమస్యల పరిష్కారం కొరకు సమ్మె చేస్తున్న ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు మద్దత్తు తెలిపి వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.
ఈ సందర్బంగా పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా తమ డిమాండ్లు నేరవెర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దత్తు తెలుపుతున్నాము అన్నారు. వారు సమ్మెకు కూర్చొని మూడు రోజులు అవుతున్న వారిని చర్చలకు పిలవకపోవటం ఈ పాలకుల చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుంది అన్నారు.
కనీసం వారు సమ్మె చేసుకోడానికి ఒక గంట ముందు వారిని డ్యూటీల నుండి రిలీవ్ చేయమని అడిగితె కమిషనర్, చైర్మన్లు వారి పని సమయాన్ని ఇంకా గంట పెంచుతాం అనడం వారి అహంకారనికి నిదర్శనం అని అన్నారు. కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్లు అయినా 12 పి.ఆర్.సి ప్రకారం 26000 వేతనం, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయటం, గత ఎనిమీది నెలలుగా పెండింగ్ లో ఏరియాల్ డబ్బులు ప్రతినెల 3500 చొప్పున 8 నెలలకు 28000 రూపాయల బకాయిలు, మే డే నుండి పెంచిన 1000 రూపాయలు చెల్లించాలి అన్నారు.
కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి అన్నారు. ఉద్యోగ సమయంలో కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభావిస్తే మున్సిపల్ వారి పూర్తి బాధ్యత తీసుకోవాలి అన్నారు. వారానికి ఒకరోజు పూర్తిగా సెలవు ఇవ్వాలి అని ఇవన్నీ కూడా గోంతెమ్మ కోరికలు కాదు అని అమలుకు సాధ్యం అయ్యేవె అని అన్నారు, కెసిఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అని అన్నారు.
కాని ఆర్మూర్ మున్సిపాలిటీలో 98% ఉద్యోగులు కాంట్రాక్ట్ వారే అని అన్నారు. వారికి పెంచిన వేతనం ఇవ్వకుండా 8 నెలల నుండి పెండింగ్లో పెట్టడం మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కి కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, చైర్మన్, కమిషనర్లు కార్మికులు డిమాండ్లు పరిష్కారించాలి అని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నం అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ మాజీద్, జిమ్మి రవి, మందుల పోశెట్టి, మీసాల రవి, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.