నిజామాబాద్ A9 news
*ఇందల్వాయి తాసిల్దార్ వెంకట్రావు కు వినతి పత్రం అందజేసిన మండల బిజెపి అధ్యక్షులు
*డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు తక్షణమే పంపిణీ చేయాలని బిజెపి డిమాండ్
*స్థలాలు లేని వారికి మూడు లక్షల గృహలక్ష్మి పథకం వర్తించదా
*స్థలం లేని వారి గతి ఏంటి
ఇందల్వాయి మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, రాజన్న నాయిడి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు తక్షణమే పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు గురువారం ఇందల్వాయి తాసిల్దార్ కార్యాలయాoలో తాసిల్దార్ వెంకట్రావు కు వినతి పత్రం అందజేశారు.
మనం పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణ ప్రజలకు, జూట మాటలు చెప్పిన మన ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలన నేటికీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇంతవరకు ఎవరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, భారీ వర్షాలతో ఇళ్లను కోల్పోయిన పేద ప్రజలకు అర్హులకు, తక్షణమే డబుల్ బెడ్రూం ఇళ్ళను కేటాయించాలని, రాజన్న కోరారు. మరియు కొత్తగా ఇళ్ల స్థలాలు ఉన్నవారు గృహ లక్ష్మీ పథకం కింద అప్లికేషన్ చేసుకోవాలని, అప్లికేషన్ చేసుకున్న వారికి ,స్థలాలు ఉన్నవారికి, మూడు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.
కానీ మొత్తానికి ఇళ్ల స్థలాలు లేకుండా వారి గతి ఏంటని, గుడిసెలలో ఉంటున్న వారి గతి ఏంటని, ఇళ్ల స్థలం లేకపోతే మీరు ఇచ్చే ఆ మూడు లక్షల రూపాయలకు అలాంటి పేదవారు అర్హులు కాదా, వారి స్థితిగతులు ఏంటి, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ,ఇవన్నీ ఎలక్షన్ లు ముందు ఉన్నాయని వాటికోసం మీరు ఆడుతున్న డ్రామా అని భారతీయ జనతా పార్టీ ఇందల్వాయి మండలం శాఖ తరపున, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, రాజన్న నాయిడి, ఉపాధ్యక్షులు, పోచంపల్లి మహేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.