నేడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ,, రాహుల్ గాంధీ  పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజి రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల భారతదేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈడి పేరుతో దేశం లో ఉన్న అనేక పార్టీ లను భయభ్రాంతులకు గురి చేసి బీజేపీ పార్టీ పబ్బం గడుపుకునే పరిస్థితి ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటే ఈ దేశం లో రాజకీయంగా మనుగడ ఉండదనే విషయం తెలిసి సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని, మా నాయకుల జోలికి వస్తె వదిలే ప్రసక్తే లేదని అన్నారు.

ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ కి ఉందని, మీరు చేసే నీచమైన పనులకు, డ్రామలకు భయపడే వాళ్ళం కాదని ఈ సంధర్బంగా బిజేపి పార్టీనీ హెచ్చరించారు.

మోడీ మతోన్మాద శక్తులతోటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ  ప్రజాస్వామ్యాన్ని రక్షించి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, అందుకనే కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు గ్రామాలలో,పల్లెలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో మోడీకి, అమిత్ షాకు బుద్ధి చెపుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీటిసి శ్రీనివాస్ గుప్త, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, మాజీ ఎంపీపీలు లలిత నర్సింగ్, శ్రీనివాస్ గౌడ్, రస్తుంపేట్ మాజీ ఎంపిటిసి అశోక్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేష్, లలిత నర్సింగ్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రషిద్, నర్సాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చర్ల సందీప్, నర్సాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్,మనిదిప్, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్,

మోహన్ దాస్ గౌడ్, శివ్వంపేట్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మన్నే శ్రీనివాస్, మల్లేష్ యాదవ్,మహేష్, సందీప్,నగేష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *