హైదరాబాద్:ఏప్రిల్ 13
హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు.
ఈరోజు మధ్యాహ్నం సమయంలో ట్రాఫిక్ పోలీసులు చలానా రాసేందుకు రన్నింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు పోలీసులు యత్నించారు.
ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టే బుల్ నిర్లక్ష్యంగా కారణంగా బైక్ అదుపుతప్పడంతో వాహనదారుడు కింద పడ్డాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం గా కారణంగానే వ్యక్తి మృతి చెందాడని వాహనదారులు ఆందోళకు దిగారు. దీంతో ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతోజీడిమెట్ల నుంచి బాలానగర్,మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపో యాయి.